గత జూలైలో షార్జాలోని తన అపార్ట్‌మెంట్‌లో భారత ప్రవాసిని అతుల్య శేఖర్ మృతి చెందిన కేసులో కొత్త వీడియో ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు ఆమె భర్త ఆమెను శారీరకంగా వేధించాడని మరియు బెదిరించినట్లు సిసిటివి పుటేజి లభించింది. షార్జాలో నివసిస్తున్న భారతీయ మహిళ అతుల్య శేఖర్ జూలై 19న, ఆమె 30వ పుట్టినరోజు తర్వాత మరియు సమీపంలోని మాల్‌లో కొత్త ఉద్యోగం ప్రారంభించబోతున్న రోజు మరణించింది. ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా షార్జాలోని అధికారులు ఆమె మరణాన్ని ఆత్మహత్యగా నిర్ధారించారు. భ ఆత్మహత్య తీర్పును సవాలు చేస్తూ కేరళలో సతీష్‌పై ఆమె తల్లిదండ్రులు కేసు దాఖలు చేశారు. అక్కడ విచారణ కొనసాగుతోంది.భర్త సతీష్ శంకర్ కొన్ని సంవత్సరాల నుండి శారీరకంగా మరియు మానసికంగా హింసించడం వల్ల ఆమె మరణానికి దారితీసిందని ఆరోపిస్తున్నారు.అతుల్య , సతీష్‌లకు 10 సంవత్సరాల కూతురు ఉంది. ఆమె ఇప్పుడు అతుల్య తల్లిదండ్రులతో నివసిస్తుంది.
అతుల్య శేఖర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -