- Advertisement -
వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్ కె పురంలో దారుణం చోటు చేసుకుంది. మేనత్తను గొడ్డలితో ఓ మేనల్లుడు చంపాడు. గత కొంత కాలంగా మేనల్లుడు మద్యానికి బానిసయ్యాడు. మందుకు డబ్బులు లేకపోవడంతో తన మేనత్తను మద్యానికి డబ్బులు అడిగాడు. లేవు అని చెప్పడంతో వీళ్ల గొడవలు తారాస్థాయికి చేరుకుంది. దీంతో మేనత్తపై అల్లుడు గొడ్డలితో దాడి చేయడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఎల్లమ్మ (60), హత్య చేసిన వ్యక్తి విజయ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గొడ్డలితో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
Also Read : డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లి కిర్క్ మృతి
- Advertisement -