- Advertisement -
బుర్కినాఫాసో ఉత్తర ప్రాంతం లోని ఓ సైనిక స్థావరంపై సాయుధులు జరిపిన దాడిలో సుమారు 50 మంది సైనికులు మరణించారు. సోమవారం బౌల్వా ప్రావిన్స్ లోని దార్గోలో ఉన్న సైనిక స్థావరంపై ఈ దాడి జరిగింది. జమాయత్ నస్ల్ ఇస్లామ్ వాల్‌ముస్లిమీన్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. సుమారు 100 మంది ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి తర్వాత స్థావరాన్ని తగులబెట్టి దోచుకున్నట్టు వారు తెలిపారు.
- Advertisement -