హైదరాబాద్: ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తీన్మార్ మల్లన్న గన్‌మెన్లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంలో కంప్యూటర్లు, పలు వస్తువులను ధ్వంసం చేయడంతో సిబ్బందిపై దాడి చేశారు. ఎంఎల్ సి కవిత అనుచరులే తనపై దాడికి పాల్పడ్డారని తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. తనపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. కవితతో కలిసి తిరిగిన వారు తమపై దాడి చేశారని మల్లన్న ఆరోపణలు చేశారు. హత్యాయత్నం ఆపేందుకు తన గన్ మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారని మల్లన్న వివరణ ఇచ్చారు. కవిత చేస్తున్న బిసి ఉద్యమాన్ని తప్పుపడుతూ మల్లన్న వ్యాఖ్యలు చేయడంతోనే ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తీన్మార్ మల్లన్న కార్యాలయం దాడి జరిగిన విషయం తెలిసిందే.