Monday, July 14, 2025

జాగృతి వర్సెస్ తీన్మార్

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న అభ్యంతరకర వ్యాఖ్యలపై
భగ్గుమన్న జాగృతి కార్యకర్తలు ‘క్యూ’ న్యూస్ ఆఫీస్‌పై
దాడి, విధ్వంసం మల్లన్న పైనా దాడికి యత్నం
అడ్డుకున్న గన్‌మెన్, గాల్లోకి కాల్పులు ఇరువర్గాలకు
చెందిన పలువురికి గాయాలు మేడిపల్లిలో ఉద్రిక్తత
చిచ్చురేపిన బిసి రిజర్వేషన్ల అంశం

ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని క్యూ న్యూస్ ఆఫీస్‌పై ఆదివారం దాడి చేశారు. ఉదయం 11.30 గంటలకు క్యూ న్యూస్ ఆఫీస్‌కు వచ్చిన 20మంది జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగి లోపలికి దూసుకువచ్చి ఎమ్మెల్సీ నవీన్‌పై దాడి చేసేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో ఓ యువకుడికి గాయాలయ్యాయి. జాగృతి కార్యకర్తల దాడిలో క్యూ న్యూస్ సిబ్బందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం… ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న బిసి ఉద్యమంపై మార్నింగ్ న్యూస్‌లో తీన్మార్ మల్లన్న తప్పుపడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా నాయకురాలిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ కార్యాలయానికి వచ్చి ఫర్నీచర్, సిబ్బందిపై దాడి చేశారు. ఈ సమయంలో తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ఉండడంతో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. జాగృతి సభ్యులు బయటకి వెళ్లకపోతే కాల్పులు జరుపుతామని మల్లన్న గన్‌మెన్ హెచ్చరించాడు.

అయినా కూడా జాగృతి కార్యకర్తలు క్యూ న్యూస్ కార్యాలయం నుంచి బయటికి వెళ్లకుండా అక్కడే ఉండి దాడి చేసేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. గన్‌మెన్ కాల్పుల్లో జాగృతి కార్యకర్త సాయి అనే యువకుడి చేతికి గాయాలయ్యాయి. సాయిని రామ్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. చేతి నుంచి బుల్టె వెళ్లినట్లు వైద్యులు గుర్తించి చికిత్స చేస్తున్నారు. కాల్పుల జరగడంతో క్యూ న్యూస్ కార్యాలయం రక్తసిక్తంగా మారింది. జాగృతి కార్యకర్తల దాడి, కాల్పుల నేపథ్యంలో మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న మల్కాజ్‌గిరి డిసిపి పద్మజా, ఎసిపి చక్రపాణి, మేడిపల్లి ఇన్స్‌స్పెక్టర్ సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేశారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.

బిసి ఉద్యమాన్ని ఆపలేరుః ఎమ్మెల్సీ నవీన్
క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. ఇలాంటి దాడులకు మల్లన్న భయపడుతాడు అనుకుంటే అది మీ భ్రమే అవుతుందని విమర్శించారు. విధుల్లో ఉన్న తన గన్‌మెన్ తుపాకీ లాక్కొని క్యూ న్యూస్ సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. కల్వకుంట్ల కవిత,ఆమె కుటుంబం తమపై హత్యాయత్నానికి పాల్పడిందని, ఇక ఊరుకోం.. మీరో,మేమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. కంచం…-మంచం అనేది తెలంగాణలో ఊతపదం.. నేను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. రౌడీల్లా తమపై దాడి చేయడమే కాకుండా మళ్లీ నామీదే కేసు పెట్టారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News