Friday, June 6, 2025

పోలీస్ స్టేషన్ లో ప్రేమజంటపై దాడి

- Advertisement -
- Advertisement -

వరంగల్: పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ జంటపై దాడి జరిగిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లబెల్లిలో యువతి యువకుడు వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.  శనిగరానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి ఇంట్లో  ప్రేమజంట తలదాచుకుంది. యువతి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో బాలరాజు ఇంట్లోకి వెళ్లారు. ప్రేమ జంటపై దాడిచేస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామస్థులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ప్రేమజంటను స్టేషన్ కు తరలించారు. యువతి తరపు బంధువులు అక్కడికి చేరుకొని పోలీసుల ముందే ప్రేమజంటపై దాడికి పాల్పడ్డారు. యువతి బంధువులు యువకుడిని చితకబాదారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News