దులీప్ ట్రోఫీలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నమెంట్లో నార్త్ జోన్‌కు ఆడుతున్న జమ్మూకశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబి దార్ (Auqib Nabi).. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు (హ్యాట్రిక్‌తో పాటు) తీసి చరిత్ర సృష్టించాడు. టోర్నీ చరిత్రలోనే ఓ బౌలర్ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. అంతేకాక.. దులీప్ ట్రోఫీలోనే హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా ఆకిబ్ నబి దార్ నిలిచాడు. గతంలో 1978/79 సీజన్లో నార్త్ జోన్ తరఫున కపిల్ దేవ్.. 2000/01 సీజన్లో వెస్ట్ జోన్‌కు ఆడుతున్న సాయిరాజ్ బహుతులే ఈ ట్రోర్నీలో హ్యాట్రిక్ సాధించాడు. వారిద్దరి తర్వాత ఆకిబ్ ఆ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో ఈ ఫీట్‌ని సాధించాడు ఆకిబ్ (Auqib Nabi). ఇన్నింగ్స్‌లోని 53వ ఓవర్ చివరి మూడు బంతులకు ముగ్గురు బ్యాట్స్మెన్లను పెవిలియన్ చేర్చాడు. విరాట్ సింగ్ (బౌల్డ్), మనిశి (ఎల్బడబ్ల్యూ), ముక్తర్ హుసేన్ (బౌల్డ్) రూపంలో ఆకిబ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 55వ ఓవర్ తొలి బంతికే సూరజ్ జైస్వాల్ (కీపర్ క్యాచ్) వికెట్‌ను తీశాడు. దీంతో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ఆకిబ్ అంతటితో ఆగలేదు. 57వ ఓవర్ తొలి బంతికి మహ్మద్ షమీ వికెట్ కూడా తీసి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేశాడు.
Also Read : డబుల్ సెంచరీతో చెలరేగిన యువ క్రికెటర్.. తొలి ఆటగాడిగా రికార్డు