న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ కోసం ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. వచ్చే నెలలో లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటిసి ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా జట్టు తలపడనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా తుది జట్టును వెల్లడించింది. రెగ్యులర్ ఆటగాళ్లందరూ జట్టులో ఉన్నారు. మిచెల్ మార్ష్ గాయపడటంతో అతని స్థానంల బ్యూ వెబ్‌స్టర్ ఆల్ రౌండర్ గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. కామెరాన్ గ్రీన్ కూడా చాలా గ్యాప్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. సామ్ కాన్‌స్టాస్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేశారు. మార్నస్ లాబుసేన్ డబ్ల్యూటిసి ఫైనల్‌లో ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉంది. గత సీజన్‌లో ఆస్ట్రేలియా తరపున రిజర్వ్ పేసర్లుగా వ్యవహరించిన సీన్ అబాట్, మైఖేల్ నేసర్‌లను జట్టులోకి తీసుకోలేదు. అన్‌క్యాప్డ్ ప్లేయర్ బ్రెండన్ డాగెట్ ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు.
కాగా, స్వదేశంలో భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో 3-1 తేడాతో విజయం సాధించిన తరువాత 67.54 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత శ్రీలంకలో జరిగిన సరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ సీజన్ లో అద్భుత ఆటతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా తొలిసారి డబ్ల్యూటిసి ఫైనల్ కు చేరుకుంది.