Monday, July 28, 2025

మహబూబాబాద్ లో బావిలో పడిన ఆటో

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: ఆటో బావిలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో జరిగింది. ఓ ఆటో ప్రయాణికులతో వెళ్తుండగా మునిగలవేడు సమీపంలో అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో ఆటోను బయటకు తీశారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న బావులను పూడ్చి వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News