Saturday, May 24, 2025

భారీ వర్షం.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆటో

- Advertisement -
- Advertisement -

కొమురం భీం: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిసి రైతులు బాధపడుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో వరదలు (Floods) బీభత్సం సృష్టిస్తున్నయా. తాజాగా కొమురం భీమ్ ఆసిఫాబాబ్ జిల్లాలో వరద (Floods) కారణంగా తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. దీంతో వంతెన నుంచి వెళ్తున్న ఆటో (Auto) ప్రవాహంలో కొట్టుకుపోయింది. అందులో ముగ్గురు ప్రయాణికులు కొంతదూరం కొట్టుకుపోయి.. అతి కష్టం మీద బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నారు. అనంతరం కొట్టుకుపోయిన ఆటోను (Auto) జెసిబి సాయంతో వెలికితీశార. తరాలు గడిచినా.. గుండి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడం లేదని.. ఇప్పటికైనా నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News