‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందిన నటి అవికా గోర్.. తాజాగా తన ప్రియుడు మిళింద్ చద్వానీతో నిశ్చితార్థం చేసుకుంది. బుధవారం అవికా ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ జంట కలిసి దిగిన ఫొటోలు, ఎంగేజ్‌మెంట్ సందర్భంగా తీసిన మధుర క్షణాలను అవికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవికా తన ఎమోషనల్ క్యాప్షన్ ద్వారా తన మనసులోని మాటలను ఇలా తెలియజేసింది. -“అతడు అడిగాడు… నేను నవ్వాను, భావోద్వేగానికి గురయ్యా. చివరకు ‘అవును’ అని చెప్పాను!
ప్రేమ అన్నది పరిపూర్ణం కాకపోయినా… అది మాయాజాలం లాంటిది”అని అవికా పేర్కొంది. మిళింద్ చద్వానీ సామాజి కార్యకర్త, వ్యాపారవేత్త. క్యాంప్ డైరీస్ పేరిట ఓ ఎన్జీవో నెలకొల్పాడు. 2019లో టీవీలో ప్రసారమైన ‘రోడీస్ రియల్ హీరోస్’ షో ద్వారా పాపులర్ అయ్యాడు. ఇక 2020 నవంబర్‌లో ఈ జంట ప్రేమలో పడినట్టు అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి వారి ప్రేమ జీవితం సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. పలు ఇంటర్వ్యూల్లోనూ అవికా తన ప్రేమ కథ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. చివరికి పెద్దల అంగీకారంతో అవికా, మిళింద్ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.