అమరావతి: పులివెందుల ఎన్నికల్లో నిజమైన ఓటర్ ను అసలు పోలింగ్ బూత్ లోకే పోనివ్వలేదని వైసిపి మాజీ ఎంపి అవినాష్ రెడ్డి (Avinash Reddy) తెలిపారు. పులివెందులలో రిగ్గింగ్ జరిగిందని అన్నారు. పులివెందుల జెడ్ పిటిసి ఉప ఎన్నికలలో వైసిపి ఓటమి చెందిన సందర్భంగా అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసలు దీన్ని ఎలక్షన్ అంటారా? అని దొంగ ఓట్లతో గెలవడం కూడా గెలుపేనా? అని ప్రశ్నించారు. పోలీసులు, టిడిపి శ్రేణులు ఓటర్ల స్లిప్పులు (Voter slips) లాక్కున్నారని విమర్శించారు. టిడిపికి గుణపాఠం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు. దొంగ ఓట్లతో కాదని నిజమైన ఓట్లతో గెలుస్తాం అని అవినాష్ రెడ్డి అని టిడిపికి సవాల్ విసిరారు.
పులివెందుల జెడ్ పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైసిపి అభ్యర్థిపై టిడిపి అభ్యర్థి 6052 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిడిపి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లురాగా వైసిపి అభ్యర్థి హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి.