Wednesday, August 20, 2025

వివేకా కేసులో నార్కో అనాలసిస్ పరీక్షకు నేను సిద్ధం: బీటెక్ రవి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదనేందుకు నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని టిడిపి నేత బీటెక్ రవి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఎంపి అవినాష్ రెడ్డి కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. వివేకా హత్య రోజే గొడ్డలితో చంపినట్లు ఎలా తెలిసిందో సిఎం జగన్ చెప్పాలని రవి నిలదీశారు. ఈ కేసులో జగన్ హస్తం ఉందనేది త్వరలో బయటకు వస్తుందని, హత్య సమయంలో వీడియో తీసి వైఎస్‌ఆర్‌సిపి పెద్దలకు పెట్టారని సమాచారం అని ఆరోపణలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ వివేకా కూతురు సునీత వస్తుందని సిఎం జగన్‌కు భయం పట్టుకుందని, పులివెందులలో అభద్రత ఉన్నందునే సతీష్ రెడ్డిని వైఎస్‌ఆర్‌సిపిలో చేర్చుకున్నారని బీటెక్ రవి చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News