Monday, August 18, 2025

బాబర్, రిజ్వాన్‌లకు షాక్!

- Advertisement -
- Advertisement -

ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన పాక్
కరాచీ: గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్ ఇచ్చింది పాక్ క్రికెట్ బోర్డు. వచ్చే నెలలో జరుగబోయే ఆసియాకప్ కోసం ప్రకటించిన జట్టు మాజీ సారథులు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లకు చోటు కల్పించలేదు. మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతుండడంతో ఆదివారం సెలెక్టర్లు 17 మందితో ఆటగాళ్లతో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. టి20 ఫార్మాట్‌లో జరుగబోయే ఈ ఎడిషన్‌కు సల్మాన్ అఘా సారథిగా వ్యవహిరించనున్నాడు.

సీనియర్లు బాబర్, రిజ్వాన్ బదులు ఫఖర్ జమాన్ సయీం ఆయూబ్, సహిబ్దజా ఫర్హాన్లు టాపార్డర్‌లో ఆడనున్నారు. ఇక పేస్ బౌలింగ్ బిభాగంను షాహీన్ ఆఫ్రిది, హ్యారిస్ రవుఫ్, స్పిన్ దళానికి మహమ్మద్ నవాజ్ నడిపించనున్నారు. ఆసియా కప్ కంటేముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గడ్డపై జరుగబోయే ముక్కోణఫు సిరీస్‌లో పాక్ ఈ జట్టుతోనే తలపడనుంది. ఆగస్టు 29న మొదలయ్యే ఈ టోర్నీలో ఆతిథ్య యూఏఈ, పాక్‌తో పాటు అఫ్గనిస్థాన్ బరిలోకి దిగనున్నాయి. వచ్చె నెల 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది.

ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్లు సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. అయితే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టలో భారీ మార్పులు చేసింది పిసిబి. టి20 వరల్డ్ కప్ నుంచి వరుసగా విఫలమవుతున్న సీనియర్‌లు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్‌లను పక్కన పెట్టేసింది. నిలకడగా రాణిస్తున్న కుర్రాళ్లను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జట్టు వివరాలు..

సల్మాన్ అఘా (కెప్టెన్), ఫఖర్ జమాన్, సహిబ్దజా ఫర్హాన్, సయీం ఆయూబ్, మొహమ్మద్ హ్యారీస్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, ఫహీం అష్రఫ్ష్ర, హుస్సేన్ తలాట్, మహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సూఫీయాన్ మకీం, షాహీన్ ఆఫ్రీది, హారిస్ రవుఫ్, సల్మాన్ మిర్జా, హసన్ అలీ, మహమ్మద్ వసీం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News