- Advertisement -
హైదరాబాద్: కోట శ్రీనివాస రావు మరణ వార్త వినగానే నటుడు బాబూమోమన్ కన్నీరు పెట్టుకున్నారు. మీడియాతో
మాట్లాడుతూ బాబూమోహన్ భావోద్వేగానికి లోనయ్యారు. కోట శ్రీనివాసరావు మరణం బాధాకరమైన విషయమని చెప్పారు.
శనివారం రాత్రి కూడా కోటతో తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. కోట మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని బాధను వ్యక్తం చేశారు. నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. కోట మరణం బాధాకరమన్నారు. కోట కళా సేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. కోట మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని బాబు పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు కన్నుమూశారు.
- Advertisement -