Thursday, August 21, 2025

23 వారాల్లో పుట్టిన శిశువు

- Advertisement -
- Advertisement -

23 వారాల్లో పుట్టిన శిశువు బతకడం చాలా అరుదైన, అద్బుతమైర విజయం అని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ చీఫ్ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ రవీందర్‌రెడ్డి పరిగే అన్నారు. గురువారం మాదాపూర్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతు ఏప్రిల్ 18వ తేదీన జన్మించిన ఈ ఆడ శివువు పుట్టినప్పడు కేవలం 565 గ్రాముల బరువు ఉందన్నారు. పాపను వెంటనే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చాడం జరిగిందన్నారు. చికిత్సలో 6 రోజులు వెంటిలేషన్, 78 రోజులు బబుల్ సీపాప్ హెచ్‌ఎఫ్‌ఎన్సి సపోర్ట్ చిన్నపాటి ఇన్పెక్షన్లకు చికిత్స, బ్లడ్ ట్రాన్స్‌ప్యూజన్‌లు, గుండె, మెదడు, రెటీనా అభివృద్దిని నిరంతరం పర్యవేక్షించడం వంటివి ఉన్నాయన్నారు.

గుండె సంబంధిత సమస్యకు మందులతో విజయవంతంగా చికిత్స అందించడం జరిగిందన్నారు. తదనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆరోగ్యకరమైన పురోగతిని సాధించిందన్నారు. అనంతరం కన్సల్టెంట్ ఆబ్సెట్రిసియన్, గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక మాట్లాడుతు తల్లివైపు నుండి చేస్తే ఈ ప్రయాణం నియోనాటల్ సంరక్షణతో సమానంగా కీలకమైనద్నారు. ముందస్తు జోక్యం నిరంతరం పర్యవేక్షణ, ఆబ్సెట్రిక్స్ నియోనాటాలజి బృందాల మధ్య సమన్వయం శిశువు బతకడానికి, ఆమె ఆరోగ్యకరమైన డిశ్చార్జ్‌కు పునాది వేశామన్నారు. శిశువు కవల సోదరి ఊపిరితిత్తుల సమస్యల కారణంగా తొమ్మిదవ రోజున దురదృష్టవశాత్తు మరణించినప్పటికి ఈ విజయవంతమైన ఫలితం భారతదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నియోనాటల్ సంరక్షణ, ఆవిష్కరణలకు మెడికవర్ నిబద్దతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News