కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంతో ఆకట్టుకున్న స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ పేరెపు కలయికలో మరో సినిమా రాబోతుంది. ఈసారి వారు ‘బ్యాడాస్’ (Badass) అనే విభిన్న చిత్రం కోసం చేతులు కలిపారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సిద్ధును మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సిద్ధు జొన్నలగడ్డ మంచి నటుడే కాకుండా, ప్రతిభగల రచయిత కూడా అనే విషయం తెలిసిందే. ‘బ్యాడాస్’ సినిమాకి రవికాంత్ పేరేపుతో పాటు సిద్ధు జొన్నలగడ్డ రచయితగా వ్యవహరిస్తున్నారు. రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
టిల్లు పాత్రతో వినోదాన్ని (Entertaining Tillu character) పంచి, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు ‘బ్యాడాస్’లో కొత్తగా కనిపించబోతున్నారు. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించడమే కాకుండా.. లోతైన మరియు పరిణతి చెందిన నటనతో మెప్పించబోతున్నారు. నిర్మాతలు టైటిల్ తో కూడిన అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్ర పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎమోషనల్ డ్రామాలలో ఒకటిగా సిద్ధమవుతోంది. ‘బ్యాడాస్’ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.