- Advertisement -
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘బద్మాషులు’. (Badmaashulu )తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, సి.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకుడు బలగం వేణు విడుదల చేశారు. ఈ సందర్భంగా బలగం వేణు మా ట్లాడుతూ “ఫన్ రైడ్‌లా అనిపిస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా”అని అన్నారు. గ్రామీణ నేపథ్యంలోని కథ, కథనం, కామెడీ చాలా ఆర్గానిక్‌గా ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ రిఫ్రెషింగ్‌గా ఉండనుంది. జూన్ 6న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్ ద్వారా థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు.
- Advertisement -