బజాజ్ ఆటో తన బెస్ట్ సెల్లింగ్ EV శ్రేణి చేతక్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. కంపెనీ బజాజ్ చేతక్ 3001 పేరిట మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి నవీకరించబడిన వెర్షన్. చేతక్ 35 EV ప్లాట్‌ఫామ్ ఆధారంగా బజాజ్ చేతక్ 3001లో ఫ్లోర్‌బోర్డ్-మౌంటెడ్, 3.0 kWh బ్యాటరీ కూడా ఉంది. కంపెనీ ఈ స్కూటర్‌ను రూ. 99,990 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది.
కొత్త ఫ్లోర్‌బోర్డ్ బ్యాటరీ ఆర్కిటెక్చర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకే ఛార్జ్‌లో 127 కి.మీ. పరిధిని ఇవ్వగలదు. దీనితో పాటు.. ఈ స్కూటర్ హెల్మెట్‌లు, షాపింగ్ బ్యాగులను పట్టుకోవడానికి 35L పెద్ద బూట్ స్పేస్‌ను కల్పించారు. ఈ స్కూటర్‌లో 750W ఛార్జర్ ఉందని, ఇది కేవలం 3 గంటల 50 నిమిషాల్లో 0 నుండి 80% వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల విషయానికొస్తే..ఈ స్కూటర్‌లో మ్యూజిక్ కంట్రోల్, గైడ్ మీ హోమ్ లైట్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ లైట్, ఆటో-ఫ్లాషింగ్ స్టాప్ లాంప్ ఉన్నాయి. ఈ స్కూటర్ దాని విభాగంలో ఉన్న ఏకైక మెటల్-బాడీ EV.