బాల బుక్స్ పబ్లికేషన్స్ ఉషా ప్రత్యూషతో విమల సంభాషణ
పుస్తక ప్రచురణ రంగంలోకి మీరు ఎలా వచ్చారు? అందుకు ప్రేరణ ఏమిటి? ఎంత కాలంగా పుస్తకాలు ప్రచురిస్తున్నారు?
నాకు చిన్నతనం నుంచే వ్యక్తుల కంటే పుస్తకాలే ఎక్కువ సహాయపడ్డాయి. పుస్తకాలు నాకు స్నేహితుల్లా మారి, నా ఆలోచనలకు దారులు చూపించాయి. మా నాన్నగారి మరణం నాకు జీవితాన్ని వ్యర్థంగా గడపకుండా, ఏదైనా జీవన సాఫల్యం కలిగే దిశగా నడవాలననే ఆలోచనను కలిగించింది. అప్పటికే నాకు సాహిత్యం పట్ల ఉన్న మక్కువ మరింత బలమై, మంచి రచనలు పాఠకుల దాకా తీసుకెళ్ళాలని తపన కలిగింది. అందుకే ప్రచురణ రంగంలో అడుగు పెట్టాను. ఆరు నెలలుగా నేను పుస్తకాలు ప్రచురిస్తున్నాను. పుస్తక ప్రచురణ రంగంలో మహిళా ప్రచురణ కర్తలు చాలా తక్కువ. ప్రధానంగా సాహిత్య, ప్రచురణ, సాహిత్య వేదికలు, అకాడమీలు ఇటువంటివన్నీ పురుష ప్రధాన రంగాలే ఇంకా.
ఒక మహిళగా ఈ రంగాన్ని ఎంచుకొని, పనిచేస్తున్న క్రమంలో మీరు ఎదుర్కొన్న ప్రత్యేకమైన ఇబ్బందులు ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకోగలరా?
మొదట ఈ రంగంలోకి వచ్చినప్పుడు నేను ఒక మహిళననే కారణంగా కొందరు సీరియస్‌గా తీసుకోలేదు. బుక్ ఫైయిర్‌లో కలసి పనిచేయాల ని ప్రయత్నిస్తే ఒక అమ్మాయి ఈ రంగంలో ఏం నిలబడుతుంది అని అన్నవారు కూడా ఉన్నా రు. ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండే ఆడది ఏమి సాధించగలదు అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అదే సమయంలో హైదరాబాద్ పుస్తక మార్కెట్ కి నేను దూరంగా ఉండడం కూడా ఒక సవాల్ అయ్యింది. అయినప్పటికీ మాటలతో కాదు, పనితోనే నిరూపించాలని అనుకున్నాను. ప్రచుర ణ సంస్థ మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే 15 పుస్తకాలు విడుదల చేసి, ప్రస్తుతం 12 కొత్త ప్రాజెక్టు లు కొనసాగిస్తున్నాను. ఇందులో నేను కేవలం లాభం కోసం కాకుండా, మంచి సాహిత్యం అందించి నా పని ద్వారా, నా ఉనికిని చాటుకోవడమే ముఖ్యంగా భావించాను.
సాహిత్య ప్రచురణలో మీకై మీరు నిర్దేశించుకున్న ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి పుస్తకాలు వేయడానికి, లేదా వేయకపోవడానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారా?
మేము ప్రచురించే ప్రతి పుస్తకంలో నాణ్య త, విలువ, సమకాలీనత ఉండాలి. భాష స్పష్టంగా, పాఠకుడికి దగ్గరగా ఉండాలి. కొత్త ఆలోచనలు, సరికొత్త దృక్కోణాలకు మేము ఎప్పు డూ స్వాగతం చెప్తాం. తక్కువ ప్రమాణాల రచనలు లేదా కేవ లం అమ్మకాల కోసం రాసిన పు స్తకాలను మేము స్వీకరించము. మా లక్ష్యం తాత్కాలిక లాభం కాదు. పాఠకులలో నాణ్యమైన సాహిత్యా న్ని వ్యాప్తి చేయడమే. ఇప్పుడు చాలా బలంగా సాహి త్యాన్ని సాహిత్యంగానే చూడాలి కానీ, దానికి విలువల్ని, ప్రమా ణాల్ని, బాధ్యతలను ఆపాదించడం త ప్పనే ఆలోచనలు, అలాగే రచయి త ఏది రాసిన, భాష, భావం ఎలా ఉన్నా, అది ప్రచురణకి అర్హమైనదే అనే వాదన లు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అలాంటి పుస్తకాలు మీ వద్దకు వచ్చిన ప్పుడు ప్రచురణకర్తలుగా, మార్కెటింగ్ కూడా చేయాలి కా బట్టి, ఎలాంటి వైఖరి మీరు సాధార ణంగా తీసుకుంటారు? సాహిత్యం కేవలం వ్యక్తిగత స్వేచ్ఛ మాత్రమే కాదు. అది సమాజంతో కూడిన బాధ్యత కూడా. రచయిత ఏది రాసినా అది అతని హక్కే అయినప్పటికీ, ప్రచురణకర్తగా మేము ఆ రచన పాఠకునికి ఏమి అందిస్తుంది? ఏ విలువను మిగులుస్తుంది? అని పరిశీలిస్తాం.
ఏ రచనైనా ప్రచురణకు అర్హమే అనే వాదనతో మేము ఏకీభవించము. నాణ్యమైన, ఆలోచనను విస్తరించే, సమాజానికి ఉపయోగపడే రచనలకే, మేము ప్రాధాన్యం ఇస్తాం. మార్కెటింగ్ అవస రం నిజమే. కానీ నాణ్యతా ప్రమాణాలను ఎప్పుడూ విస్మరించము.
పబ్లికేషన్ రంగంలో నూతన మార్పులు గత కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్నాయి?
ప్రచురణలోనూ, అమ్మకాలకు సంబంధించి కూడా కొత్త పోకడలు వచ్చాయి? ఒక ప్రచురణా సంస్థ అంతిమంగా ఒక సంస్థగా నిలబడాలి అని అంటే ‘లాభం-పెట్టబడి-లాభం’ తప్పదు.
మార్కెటింగ్, బిజినెస్ పోటీని తట్టుకుని ముందుకు సాగేందుకు మీరు ఎలాంటి పద్ధతులు ఎంచుకున్నారు?
ఇటీవలి కాలంలో ప్రచురణా రంగం చాలా మారిపోయింది. ఒకప్పుడు పుస్తక విక్రయాలు ప్రధానంగా ప్రదర్శనలు, దుకాణాలపైనే ఆధారపడేవి. ఇప్పుడు ఆన్‌లైన్ మార్కెట్, ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫారంలు, సోషల్ మీడియా ప్రమోషన్లు పెద్ద ప్రపంచంగా మారాయి. పాఠకులు నేరుగా మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా పుస్తకాలను ఆర్డర్ చేస్తున్నారు. మేము కూడా ఈ మార్పుల ను స్వీకరించి, మా పుస్తకాలను ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంచుతున్నాం. సోషల్ మీడి యా గ్రూపులు, బుక్ క్లబ్బులు, లైవ్ డిస్కషన్లు వంటివి కొత్త ప్రమోషన్ పద్ధతులుగా ఉపయోగిస్తున్నాం. మార్కెటింగ్‌లో ‘లాభంపెట్టుబడి లాభం’ అనే సమీకరణ తప్పనిసరి అయినప్పటి కీ, మా దృష్టి కేవలం అమ్మకాలపైనే కాదు. పాఠకులతో దీర్ఘకాలిక నమ్మకం పెంచడమే మా ల క్ష్యం. అందుకే నాణ్యమైన పుస్తకాలను మాత్రమే ప్రచారం చేస్తున్నాం.
తన జీవిక రచనల ద్వారానే అని, తాను పూర్తి సమయం రచయితనని చెప్పుకునే పరిస్థితి మన దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో దాదాపు లేదనే చెప్పవచ్చు. రచయితలకి తమ రచనపై కాపీరైట్ ఉండడం, రచనకి రెమ్యునరేషన్ అంద డం, పుస్తకాల అమ్మకం ద్వా రా వచ్చే ఆదాయంలో వాళ్లకి భాగం ఇవ్వడం.. ఇలాంటి విషయాలపై బాల ప్రచురణ కర్తలు మనుకుంటున్నారు? రచయితలే పుస్తకానికి ప్రాణం. అందుకే వారి కాపీరైట్ హక్కులు కాపాడటం, అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం లో తగిన రాయల్టీ ఇవ్వడం మా బాధ్యత. రచయితల కృషి గౌరవించబడితేనే సాహిత్యం ఆరోగ్యంగా ముందుకు వెళ్తుందని మేము నమ్ముతాం.
తక్కువ కాలంలోనే మీరు చాలా వేగంగా, పుస్తకాలు ప్రచురిస్తున్నారు. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో మెహాఫిల్ పాఠకులతో పంచుకుంటారా?
మా భవిష్యత్ ప్రణాళికల్లో రెండు ప్రధాన దిశలు ఉన్నాయి. ఒకవైపు వివిధ భాషల్లో వెలువడిన విలువైన సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి పాఠకుల ముందుకు తీసుకురావడం. ఇందులో ప్రతి పుస్తకానికి సంబంధిత రచయిత లేదా వారి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నాకే ప్రచురణ చేపడతాం. ఇక మరోవైపు, తెలుగులో ప్రాం తీయ మాండలికల్లో రాస్తున్న కొత్త రచయితలను పరిచయం చేయడం. సాహిత్యం కేవలం కొన్ని విభాగాలకు పరిమితం కాకుండా, అన్ని రకాల జానర్లలో పుస్తకాలు తీసుకురావడమే మా లక్ష్యం. వీటిలో బాలసాహిత్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తు న్నాం. ఎందుకంటే పిల్లలు చిన్న వయసులోనే సాహిత్యానికి దగ్గరైతే, వారి జీవితానికి అవసరమైన జ్ఞానం, విలువలు, ఊతం అందుతుందని మేము నమ్ముతున్నాం.