- Advertisement -
రంగస్థల కళాకారుడు, బలగం మూవీ నటుడు జీవి బాబు కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు తెలుస్తోంది. వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల బలగం మూవీ డైరెక్టర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. జీవి బాబు జీవితం అంతా నాటక రంగంలోనే గడించిందని.. బలగం సినిమా ద్వారా ఆయనను అందిరికీ పరిచయం చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వేణు చెప్పారు. జీవి బాబు మృతి పట్ల పలువురు సినిమా వాళ్లు, ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. కాగా, బలగం సినిమాలో కొమురయ్య తాత తమ్ముడు అంజన్నగా జీవీ బాబు నటించిన సంగతి తెలిసిందే.
- Advertisement -