Wednesday, July 30, 2025

కొత్త ఫీజుల కోసం కసరత్తు షురూ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా ఇతర వృత్తివిద్యా కళాశాలలకు ఫీజుల ఖరారు కోసం కొత్త విధివిధానాల రూపకల్పనకు ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ తొలి సమావేశం మంగళవారం కూకట్‌పల్లిలోని జెఎన్‌టియుహెచ్‌లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కే.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, తమిళనాడుకు చెందిన ఉన్నత విద్యామండలి ప్రతినిధులతో పాటు పలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానం గా కాలేజీల్లో విద్యా ప్రమాణాలు, వసతులతో పా టు సమస్యలపై యాజమాన్యాలతో చర్చించారు. రాష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యా కోర్సుల ఫీజులను సవరించాల్సి ఉండ గా, కొన్ని కాలేజీల ఫీజులు గతంలో కూడా సవరించలేదని, దాంతో తాము ఆర్థికంగా ఇబ్బందు లు ఎదుర్కొంటున్నట్లు యాజమాన్యాలు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలలో ఫీజులపై నియంత్రణ లేకపోవడంవల్ల ఆ యూనివర్సిటీలు తమకు నచ్చినట్లుగా ఫీజులు పెంచుకుని వసతులు కల్పించడం తో పాటు మంచి వేతనాలతో ఉత్తమ ఫ్యాకల్టీని నియమించుకుంటున్నాయని తెలిపారు. తమ కాలేజీలపై ఫీజుల నియంత్రణ ఉండటంతో మెరుగైన వసతుల కల్పనకు, మంచి ఫ్యాకల్టీని నియమించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ యూనివర్సిటీలలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో ప్రైవేట్ సమానంగా ఫీజులు ఉన్నాయని, అందువల్లనే ప్రభుత్వ వర్సిటీలు మెరుగైన వసతులు కల్పించగలుగుతునాయని ప్రైవేట్ యాజమాన్యాలు చెప్పినట్లు తెలిసింది. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రభుత్వ యూనివర్సిటీలో సెల్ఫ్‌ఫైనాన్స్ బ్రాంచీల ఫీజులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను ఖరా రు చేయాలని కమిటీని కోరినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News