గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ’అఖండ 2🙁Akhanda 2′) తాండవం’ కోసం నాలుగోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇటివలే జార్జియాలోని గ్రాండ్ లోకేషన్స్‌లో కీలకమైన యాక్షన్ సీన్స్‌ని షూట్ చేశారు.
సోమవారం నుంచి ఆర్ఎఫ్సీలో ‘అఖండ 2’ కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో బాలకృష్ణతో పాటు యూనిట్ అంతా పాల్గొంటున్నారు. సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టీజర్ అదరగొట్టింది. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. డైనమిక్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.