హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) అంటే రికార్డులకు పెట్టింది పేరు. ఆయన సినిమా వస్తుందంటే అది అభిమానులకు పండగే. ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించిన బాలయ్యకు.. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో(గోల్డెన్ ఎడిషన్)లో ఆయన పేరు చేరింది. భారతయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడు బాలకృష్ణ కావడం విశేషం.
ఇటీవలే బాలకృష్ణ (Balakrishna) ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సినీ రంగంలో ఆయన అందించిన సేవలకుగాను కేంద్రం పద్మభూషన్ పురస్కారంతో గౌరవించుకుంది. ఇక 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో.. తెలుగు నుంచి బాలకృష్ణ నటించి ‘భగవంత్ కేసరి’ చిత్రానికి అవార్డు లభించింది. ఇప్పడు తాజాగా బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నెల 30వ తేదీన ఆయన్ను సత్కరించనున్నారు. ఈ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు ఆయన కూతురు బ్రాహ్మణి, హీరో నారా రోహిత్ తదితరులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.