హైదరాబాద్: టిడిపి ఎంఎల్ఎ, నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు చేరింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా బాలకృష్ణ రికార్డు సృష్టించారు. ఆయన సినీ కెరీర్‌కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అవార్డు దక్కడంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. 50 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికి హీరోగా కొనసాగుతుండడం గ్రేట్ అని అభిమానులు కొనియాడుతున్నారు. ఈ మేరకు ఆయన అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో బాలకృష్ణ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎపి మంత్రి నారా లోకేశ్, తదితరులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సూపర్‌స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పారు. బాలకృష్ణ డైలాగ్ ను రజనీ కాంత్ చెప్పడంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. బాలకృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివిటీ ఉంటుందని రజనీ ప్రశంసించారు.
Also Read: వార ఫలాలు (31-08-2025 నుండి 06-09-2025 వరకు)