- Advertisement -
హైదరాబాద్‌లోని బాలానగర్ వంతెనపై రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో డిసిఎం అతివేగంగా పోలీసులకు ఢీకొట్టడంతో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలానగర్ ఫ్లైఓవర్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అతడు చనిపోయాడు. వాహనదారుల సమాచారం మేరకు ఎస్ఐ వెంకటేశం తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో డిసిఎం వ్యాను అతివేగంగా పోలీసులను ఢీకొట్టడంతో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డిసిఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
- Advertisement -