Thursday, May 15, 2025

బాలాపూర్ లో భార్య చేయి నరాలు కోసి.. గొంతు నులిమి… హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య తలపై కర్రతో బాది, గాజుతో చేయి నరాలు కోసి, చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. సంఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోల్కొండకు చెందిన చెందిన జాకీర్ అహ్మద్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య నాజియా బేగమ్‌కు(30) ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండో భార్య మరొక వ్యక్తి వివాహేర సంబంధం పెట్టుకుందని పలుమార్లు అనుమానించడంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

దీంతో గోల్కొండ నుంచి మకాం బాలాపూర్ ప్రాంతం జల్‌పల్లిలోని కొత్తపేట కాలనీకి మార్చాడు. అనుమానంతో పలుమార్లు భార్య రహస్యంగా గమనిస్తూ వచ్చాడు. రెండు రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో పిల్లలు వేరే రూమ్‌లో పడుకున్నారు. అదే సమయంతో భార్యను మరో రూమ్‌లోకి తీసుకెళ్లి అక్రమ సంబంధం విషయంలో ఆమెను నిలదీశాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కర్రతో భార్య తలపై బాదాడు. ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో కిటికీకి ఉన్న అద్దాన్ని పగులగొట్టి చేయి నరాన్ని కోశాడు. అనంతరం భార్య గొంతు నులిమి హత్య చేశాడు. పిల్లలు గమనించి తన అమ్మమ్మకు సమాచారం ఇచ్చారు. నాజియా బేగం పుట్టింటి వారు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News