కరీంనగర్: తెలంగాణకు ఆర్మీ హెలికాప్టర్ల రాక ఆలస్యంపై రక్షణ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ చేశారు. తెలంగాణకు మూడు హెలికాప్టర్లను రడీగా ఉంచామని కేంద్ర రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం అనుకూలించక పోవడంతో బాధిత ప్రాంతాలకు చాపర్ల రాక ఆలస్యమవుతోందని అధికారులు వివరించారు.
ప్రత్యామ్నాయ స్టేషన్ల నుండి చాపర్లను రప్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. నాందేడ్, బీదర్ స్టేషన్ల నుండి చాపర్లను పంపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భారీ వర్షాలతో ఎస్సారెస్పి, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని బండి సంజయ్ చెప్పారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన తీసుకునే చర్యలకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయని తెలియజేశారు. వీలైనంత తొందరగా చాపర్లను పంపాలని కోరారు.
Also Read: ప్రవాహం అవతలి వైపు చిక్కుకుపోయిన పశువుల కాపరిని రక్షిస్తాం: కలెక్టర్ అభిలాష