- Advertisement -
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సహా హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపుల్ని రద్దు చేస్తూ 2024లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో తీవ్ర నిరాశ, నిస్ప్రహల్లో మునిగిపోయిన జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బాసటగా నిలిచారు. జర్నలిస్టులెవరూ బాధపడొద్దని సూచించారు. జర్నలిస్టులకు బిజెపి అండ గా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బిజెపియేనని తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా న్యాయ నిపుణులతో ముందుగానే చర్చించి జర్నలిస్టులందరికీ ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కకపోవడానికి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల అవకాశవాద రాజకీయాలే కారణమని విమర్శించారు.
- Advertisement -