Friday, August 15, 2025

ఓట్ల చోరీ జరిగితే వాళ్లకు అన్ని సీట్లు ఎలా వచ్చాయి: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కొద్ది రోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఓట్ల చోరీకి, బిజెపికి ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. యూసుఫ్‌గూడలో బిజెపి సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.రాంచంద్ర రావుతో కలిసి ఆయన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓట్ల చోరీ జరిగితే ఇండి కూటమికి 230 ఎంపి సీట్లు వచ్చేవా? బిజెపికి 240 ఎంపి సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి. ఓట్ల చోరీ జరిగితే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా? ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News