- Advertisement -
కరీంనగర్: ఇంకెన్నాళ్లు బిఆర్ఎస్ కు దోచిపెడతారని గ్రానైట్ వ్యాపారులను కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. గ్రానైట్ వ్యాపారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంతో గ్రానైట్ అసోసియేషన్ నాయకులు ఖంగుతున్నారు. సమాజానికి పనికొచ్చే సేవ చేయరా? తనపై నిందలేసినా ఖండించరా? అని అడిగారు. చైనాతో సంబంధాలు మెరుగుపర్చినా ప్రధాని నరేంద్ర మోడీకి థాంక్స్ చెప్పరా? అని నిలదీశారు. భయపడుతూ ఎన్నాళ్లు వ్యాపారం చేస్తారని, స్వేచ్చగా వ్యాపారం చేసే పరిస్థితిని తాను కల్పిస్తానని స్పష్టం చేశారు. పిఎం మోడీ చైనాలో పర్యటన చేయడంతో వ్యాపార సంబంధాలు మెరుగవుతున్నాయని గ్రానైట్ వ్యాపారులు తెలిపారు. సమాజానికి సేవ చేయాలని బండి సూచించడంతో చేస్తామని చెప్పిన సంఘం నేతలు తెలిపారు. అధికారులకు గ్రానైట్ వ్యాపారులు సహకరించాలని బండి సంజయ్ కోరారు.
- Advertisement -