- Advertisement -
మావోయిస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు ఎంతో మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారని తీవ్రంగా విమర్శించారు. కర్రెగుట్టల్లో మావోల కోసం కొనసాగుతున్న ఆపరేషన్ నేపథ్యంలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టన పెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవన్నారు.
మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ అని చెప్పారు. అయినా.. కాంగ్రెస్, బిజెపి, టిడిపి సహా ఎంతో మంది నేతలను మావోయిస్టులు చంపారని దుయ్యబట్టారు. అమాయకులను కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలు ఉండవని బండి సంజయ్ స్పష్టం చేశారు.
- Advertisement -