- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. సిఎం మాట్లాడాల్సిన మాటలు కావన్నారు. 420 హామీలిచ్చి వంద రోజుల్లో అమలుచేస్తామన్నారని.. ‘ఇప్పడు ఆరు గ్యారెంటీలు అమలుచేయలేం.. మమ్మల్ని అడగకండి’ అంటూ సిఎం రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు.
కాగా, ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు సిద్ధమవుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి మాట్టాడుతూ.. తెలంగాణ దివాళా తీసిందని.. బయట ఒక్క రూపాయి అప్పు పుట్టడం లేదన్నారు. తెలంగాణ ప్రతినిధులను దొంగలు చూసినట్లు చూస్తున్నారని.. తనను కోసినా ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాదన్నారు. వచ్చే ఆధాయం మొత్తం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు, పించన్లకే సరిపోతుందని చెప్పారు.
- Advertisement -