హైదరాబాద్: తెలంగాణ కోసం మాజీ సిఎం కెసిఆర్ కు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మద్దతు తెలిపిందని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ (Bandisanjay) తెలిపారు. తన కొడుకు ఖరీదైన బట్టలు వేసుకుంటే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఓర్వలేకపోయారని అన్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి స్థాయి కంటే కెటిఆర్ ది తక్కువ స్థాయని చెప్పారు. కెసిఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే ఉద్యమాన్ని ఆంధ్రజ్యోతి నడిపిందని తెలియజేశారు. ఎబిఎన్ పై దాడిచేసి చూడు.. నీ బిఆర్ఎస్ ను ఏం చేస్తామో తెలుస్తుంది అని మండిపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని స్థాయిలో ఉందని, కెసిఆర్ కుటుంబంపై కాంగ్రెస్ కు ఎందుకంత ప్రేమ? అని కెసిఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు? అని ప్రశ్నించారు. వాడు వీడు అని ఇష్టానుసారంగా మాట్లాడితే.. కెసిఆర్ కుటుంబం కార్లు కూడా తిరగనివ్వం అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State) రాకముందు..తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? అని నిలదీశారు. కెసిఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ధ్వజమెత్తారు. కెటిఆర్ కు అహంకారం తగ్గలేదు అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.