Sunday, July 20, 2025

లంకతో బంగ్లా తొలి టెస్టు డ్రా

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్యగాలె వేదికగా జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. శనివారం ఐదో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన లంకను బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లామ్ హడలెత్తించాడు. అతను 23 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కళ్లు చెదిరే శతకం సాధించిన ఓపెనర్ పాథుమ్ నిసాంకా (24) పరుగులు చేశాడు. మరో ఓపెనర్ లహిరు ఉడారా (9), దినేశ్ చండీమల్ (6), ఎంజిలో మాథ్యూస్ (8) నిరాశ పరిచారు.

ఆట ముగిసే సమయానికి కమిండు మెండిస్, కెప్టెన్ ధనంజయ డిసిల్వా చెరో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లోఆరు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన నజ్ముల్ హుస్సేన్ శాంటో 199 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 125 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ షద్మన్ ఇస్లామ్ (76), ముష్ఫికుర్ రహీం (49) తమవంతు సహకారం అందించారు. కాగా, నజ్ముల్ తొలి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News