- Advertisement -
బంగ్లాదేశ్లో విమాన ప్రమాదం జరిగింది. సోమవారం ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని ఓ పాఠశాల క్యాంపస్‌లో బంగ్లాదేశ్ మిలిటరీ శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మధ్యాహ్నం ఢాకాలోని మైల్‌స్టోన్ స్కూల్, కళాశాల క్యాంపస్‌లో ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయినట్లు సైనిక, అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో క్యాంపస్ లో విద్యార్థులు ఉన్నారని.. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. సంఘటనాస్థలంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి.. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కూలిపోయిన F-7 BGI విమానం వైమానిక దళానికి చెందినదని బంగ్లాదేశ్ ఆర్మీ ప్రజా సంబంధాల కార్యాలయం ధృవీకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -