Sunday, May 4, 2025

పాక్‌పై భారత్ దాడి చేస్తే.. ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకోవాలి

- Advertisement -
- Advertisement -

భారత్ ను ఆక్రమించుకోవాలంటూ బంగ్లాదేశ్ మాజీ సైనిక అధికారి ఫజ్లూర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌పై దాడి చేస్తే, ఢాకా చైనాతో కలిసి భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

“భారతదేశం పాకిస్తాన్‌పై దాడి చేస్తే, బంగ్లాదేశ్ ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాలను ఆక్రమించాలి. ఈ విషయంలో ఉమ్మడి సైనిక ఏర్పాటుపై చైనాతో చర్చలు ప్రారంభించడం అవసరమని నేను భావిస్తున్నాను” అని తన ఫేస్‌బుక్ ఖాతాలో రెహమాన్ బెంగాలీ భాషలో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే రెహమాన్ పోస్ట్ పై యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News