Sunday, August 3, 2025

హసీనా లేకుండానే.. అమానుషకాండపై విచారణ షురూ

- Advertisement -
- Advertisement -

ఢాకా ః ఆమె హాజరీతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లో విచారణ ఆరంభించారు. హసీనా ఇతరులపై అమానుషకాండ కేసు దాఖలు అయింది. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసిటి) ఈ ప్రక్రియను హసీనా హాజరీతో నిమిత్తం లేకుండా చేపట్టింది. ఆమె తమ పదవీకాలంలో విద్యార్థుల నిరసనలపై దమననీతితో వ్యవహరించారని, అమానుష నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు వెలువడ్డాయి. ఆమెకు పలుసార్లు సమన్లు ఆమె పేరిట పంపించారు.

షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో అజ్ఞాత ప్రదేశంలో ప్రవాసంలో ఉంటున్నారు. ఆమెపై కేసుల విచారణకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ నియుక్త చీఫ్ ప్రాసిక్యూటర్ తజుల్ ఇస్లామ్ తమ విచారణ దశలో తీవ్రస్థాయిలో స్పందించారు. అన్ని భీకర ఘోర నేరాలకు ఆమెనే ప్రధాన కేంద్రీకృత బిందువు. విచారణ క్రమంలో అత్యంత గరిష్ట స్థాయి శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. అమానుష చర్యల ఈ కేసులో హసీనాతో పాటు అప్పటి హోం మంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమాల్, మాజీ ఐజిపి చౌదరి అబ్దుల్లా అల్ మమూన్‌లను సహ నిందితులుగా చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News