డిజిటల్ అరెస్ట్ మోసానికి పాల్పడిన కేసులో ప్రతాప్ కేసరి ప్రధాన్ (32) అనే నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడిపై దేశవ్యాప్తంగా 7 కేసులలో నిందితుడికి ప్రమేయం ఉండగా, వాటిలో 2 తెలంగాణ రాష్ట్రంలోని కేసు లు ఉన్నాయి. నిందితుడు బెంగళూరులోని ఒక ప్రైవేట్ బ్యాంకులో ఖాతా విభాగంలో కస్టమర్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నా డు. బ్యాంకు ఖాతా వివరాలను వాట్సాప్ ద్వారా మోసగాళ్లకు పంచుకుని, అక్రమంగా డబ్బు సంపాదించాడు. హైదరాబాద్‌కు చెందిన 60 ఏళ్ల వృద్ధ మహిళ తాను డిజిటల్ అరెస్ట్ మోసానికి గురయ్యానని ఫిర్యాదు చేసింది. జులై 4న ఉదయం 10 గంటల ప్రాంతంలో ముంబైలోని అంధేరి -తూర్పుకు చెందిన పోలీసు అధికారిగా నటిస్తూ ప్రదీప్ సావంత్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి, తన ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు,
మనీలాండ రింగ్‌కు సంబ ంధించి తనపై కేసు నమోదు చేయబడిందని తెలిపాడని బాధిత మహిళ పేర్కొంది. ఆమె సహకరించకపోతే 3-11 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 15 లక్షల జరిమానా విధించబడుతుందని బెదిరించారు. మోసగాళ్ళు ఆమెను పోలీసులు, ఆర్‌బిఐ అధికారులుగా నటిస్తున్న వ్యక్తులతో ఆరు గంటల పాటు కాన్ఫరెన్స్/వీడియో కాల్‌లో సంప్రదించి, ఆరోపించిన మోసగాళ్లను గుర్తించడానికి రూ. 10 లక్షలు ఏర్పాటు చేయాలని సూచిం చారు. భయం, ఒత్తిడితో, ఆమె తన ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి నిధులను ఉపసంహరించుకుని, వారు అందించిన ఖాతాకు రూ. 10,02,047.20/-బదిలీ చేసింది. బాధిత మహికు సిబిఐ, ఆర్‌బిఐ, ఇడి నుండి వచ్చినట్లుగా చెబుతున్న లేఖలు సహా నకిలీ పత్రాలను, నకిలీ పోలీసు ఐడి కార్డును కూడా పంపారు. క్లియరెన్స్ సర్టిఫికేట్ తో పాటు 24 గంటల్లోపు తన డబ్బును తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని బాధిత మహిళ వెల్లడించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.