వచ్చే నెల అంటే ఆగస్టులో వివిధ రాష్ట్రాలు, నగరాల్లో మొత్తం 14 రోజులు బ్యాంకులు మూసివేయనున్నారు. 5 ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కాకుండా వివిధ ప్రదేశాలలో 7 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందువల్ల ఖాతాదారులు ఏమైనా బ్యాంకు పనులు ఉంటే సెలవులను గమనించి ముందు జాగ్రత్త వహించాలి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆగస్టు 15 నుండి 17 వరకు వరుసగా 3 రోజులు బ్యాంకుల్లో ఎటువంటి కార్యకలాపాలు ఉండవు.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 16న జన్మాష్టమి/కృష్ణ జయంతి, ఆగస్టు 17న ఆదివారం కారణంగా బ్యాంకులు మూసివేస్తారు. అస్సాంలో ఆగస్టు 23 నుండి 25 వరకు బ్యాంకుల్లో ఎటువంటి కార్యకలాపాలు ఉండవు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా పని చేయవచ్చుబ్యాంకు సెలవులు ఉన్నప్పటికీ మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఎటిఎం ద్వారా డబ్బు లావాదేవీలు చేయవచ్చు లేదా ఇతర పనులు చేసుకోవచ్చు. ఈ సౌకర్యాలు బ్యాంకు సెలవుల వల్ల ప్రభావితం కావు.