Monday, September 8, 2025

నగరంలో భారీ మొత్తంలో రద్దైన నోట్లు పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2016లో కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయిల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే రద్దై దాదాపు పది సంవత్సరాలు కావొస్తున్న ఆ నోట్లు (Banned Notes) ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ప్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న మూడు బ్యాగులు తనిఖీ చేయగా.. రూ.2 కోట్ల విలువైన రద్దైన రూ.500, రూ.1000 నోట్లు దొరికాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం వారిని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Also Read : కలిసికట్టుగా కృషి చేసి రాహుల్‌ని ప్రధానిని చేయాలి: భట్టి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News