లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న సినిమా ‘రాజు గాని సవాల్’. ( Raju gaani saval) ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్‌ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం ‘రాజు గాని సవాల్‘ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా.భద్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ.. ‘రాజు గాని సవాల్‘ మూవీ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని (film should successful) కోరుకుంటున్నాను‘అని అన్నారు. దర్శక నిర్మాత, హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ ‘మా జీవితాల్లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలు ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. సహజంగా ఉండేందుకు కవాడిగూడ రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. మధ్య తరగతి వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక పెద్ద సమస్య ఎదురైతే ఆ మధ్యతరగతి వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్రంలో చూస్తారు’ అని తెలిపారు.