Sunday, September 7, 2025

కామారెడ్డిలో ఈ నెల 15న బిసి సభ నిర్వహించనున్నాం: మహేశ్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కామారెడ్డి గడ్డమీద బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించామని  టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. హామీ ప్రకారం మూడు బిల్లులు చేసి కేంద్రానికి పంపామని అన్నారు. కామారెడ్డిలో ముఖ్య నాయకులతో కాంగ్రెస్ సన్నాహక సమావేశం, బిసి డిక్లరేషన్ విజయోత్సవ సభ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డిలో ఈ నెల 15న బిసి సభ నిర్వహించనున్నామని తెలియజేశారు.

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకాకుండా బిజెపి చేస్తోందని, బిజెపి ఎప్పుడూ మతం, దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రమంత్రి బండిసంజయ్, ధర్మపురి అర్వింద్ బిసిల గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. అవినీతి సొమ్ము వాటాల పంపకాల్లో తేడా రావడంతో ఎమ్మెల్సీ కవిత బయట పెట్టిందని, ఇదే విషయం ఐదేళ్ల క్రితం చెప్పి ఉంటే కవితను ప్రజలు నమ్మేవారని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Also Read : బిఆర్ఎస్‌లోనే ఉన్నాను… ఏ పార్టీ కండువా కప్పుకోలేదు: బండ్ల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News