Saturday, September 6, 2025

భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. బిసిసిఐ ఫైనల్ నిర్ణయం..

- Advertisement -
- Advertisement -

ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నమెంట్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9వ తేదీన ఈ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడొద్దని డిమాండ్లు వస్తున్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడవద్దని బిసిసిఐపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ, బిసిసిఐ దీనిపై ఇప్పటివరకూ రియాక్ట్ కాలేదు. అయితే కొద్ది రోజుల క్రితం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశంతో భారత్ ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని.. కేవలం మల్టీ నేషనల్ సిరీస్‌లలో పాకిస్థాన్‌తో తలపడుతుందని కేంద్రం నిర్ణయించింది.

ఈ విషయాన్నే బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు. ‘‘బిసిసిఐ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తప్పినిసరిగా అనుసరించాలి. మల్టీనేషనల్, ఇంటర్‌నేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొనే అంశంపై స్ఫష్టంగా పేర్కొంది. ఇలాంటి వేదికలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాబట్టి టీం ఇండియా మల్టీనేషనల్ టోర్నమెంట్‌లు ఆడుతుంది. ఆసియాకప్ (Asia Cup 2025).. ఆసియా ఖండంలోని దేశాలు పాల్గొనే మల్టీ నేషనల్ టోర్నమెంట్. భారత్ ఇందులో పాల్గొనాల్సిందే. అదే విధంగా ఐసిసి టోర్నమెంట్‌లలో భారత్‌తో సత్సంబంధాలు లేని జట్లతో కూడా మనం ఆడతాం. కానీ, దైపాక్షిక సిరీస్‌ల మాత్రం ఆడే ప్రసక్తే లేదు’’ అని సైకియా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత్ సెప్టెంబర్ 14వ తేదీన పాకిస్థాన్‌తో తలపడనుంది.

Also Read : మహిళల ఆసియా కప్ హాకీలో భారత్ శుభారంభం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News