ముంబై: భారత క్రికెట్ బృందం గురించి బిసిసిఐ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. యుఎఇ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో టీమిండియా బుధవారం తొలి మ్యాచ్‌ను ఆడిన విషయం తెలిసిందే. యుఎఇతో భారత్ ఈ మ్యాచ్‌లో తలపడింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఉన్న వీడియోను భారత క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో పాటు జట్టు సభ్యులు ఉన్నారు.
హార్దిక్ పాండ్య, అర్ష్‌దీప్, బుమ్రా తదితరులు ఈ వీడియోలో ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తారు. ‘హలో వైట్ బాల్ క్రికెట్ ఫ్యాన్స్..మిమ్మల్ని మరోసారి కనువిందు చేయడానికి మేం మళ్లీ వచ్చేశాం. టోర్నీ కోసం ఫుల్‌గా రీచార్జ్ అయ్యాం. గతంలో మేం ఇక్కటే వేటాడాం. విజేతగా నిలిచాం. ఆసియాకప్‌లో ఇప్పటికే 8 సార్లు ఛాంపియన్‌గా ఉన్నాం. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. టోర్నీలో ఏ ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోం. ఆసియాకప్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ వారసత్వాన్ని కొనసాగిస్తాం’ అంటూ ఆ వీడియోలో టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. ప్రస్తుతం బిసిసిఐ విడుదల చేసిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
Also Read: ఆసియా కప్ 2025: 4.3 ఓవర్లలోనే భారత్ విజయం