న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మే 24న(శనివారం) ప్రకటించనుంది.సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించే ముందు విలేకరుల సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భారత జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్ ను ప్రకటించనున్నారు. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ లు టెస్టు కెప్టెన్ రేసులో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా వినిపిస్తోంది. అయితే, గిల్ నే కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జట్టులో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ లను జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం.
ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) నాల్గవ ఎడిషన్‌లో టీమిండియా ఆడబోయే మొదటి మ్యాచ్ అవుతుంది. మొదటి రెండు ఎడిషన్‌లలో భారత్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.