ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్లల మద్య యుద్ధ వాతావరణ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మ్యాచ్‌లను తాత్కాలికంగా వాయిదా వేశారు. వారం రోజుల తర్వాత టోర్నమెంట్ జరుగుతుందని బిసిసిఐ ప్రకటించింది. అయితే ఈ పరిస్థితి ఎక్కువకాలం ఉండదని.. బిసిసిఐ(BCCI) తప్పకుండా ఐపిఎల్‌ను పూర్తి చేస్తుందని.. భారత మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డారు.
‘ప్రస్తుతం యుద్ధ వాతావరం ఉందని బిసిసిఐ ఐపిఎల్‌ను(IPL) వాయిదా వేసింది. ఎందుకంటే భారత క్రికెటర్లతో పాటు.. విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వారి భద్రత మనకు ముఖ్యం. అయితే త్వరలోనే ఐపిఎల్ మళ్లీ ప్రారంభం అవుతుంది. టోర్నమెంట్ కీలక దశలో ఉంది. ధర్మశాల, చంఢీగఢ్, ఢిల్లీ, జైపూర్.. తదితర మైదానాల్లో మ్యాచ్‌లు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం బిసిసిఐ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి. బిసిసిఐ(BCCI) ఐపిఎల్‌ను తప్పకుండా పూర్తి చేస్తుంది. ఎందుకంటే ఒత్తిడిని మరింత కాలం తట్టుకొనే సీన్ పాకిస్థాన్‌కు లేదు’ అని గంగూలీ అన్నారు.