Monday, August 25, 2025

రెండో పాట వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. (The Girlfriend) ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆరట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ‘ది గర్ల్ ఫ్రెండ్‘ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ’ఏం జరుగుతోంది…’ లిరికల్ సాంగ్ ను ఈ నెల (Song this month) 26న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. ఫీల్ గుడ్ లవ్ సాంగ్ గా ’ఏం జరుగుతోంది..’ రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News