Monday, July 28, 2025

కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బీరప్ప బోనాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/బోడుప్పల్ : బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో కురుమ సంఘం ఆద్వర్యంలో బీరప్ప బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు.బోనాల ఊరేగింపులో ఓగ్గు కళాకారులు డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం శ్రావణ మాసంలో కురుమ సంప్రదాయమైన పసరు పిల్లలను అమ్మవారికి సమర్పించారు.

తెలంగాణ లో సంప్రదాయాలకు పుట్టినిల్లన్నారు.పిల్లపాపలు చల్లగుండాలని మొక్కులు తీర్చుకున్నారు.బీరప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో భక్తులు, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు.కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ వాసూరి రాము కురుమ,సారి కురుమ సానికె శశికుమార్ కురుమ,కురుమ సంఘం అధ్యక్షుడు జెన్నె దర్మయ్య కురుమ,ప్రధాన కార్యదర్శి మరాటి మల్లేష్ కురుమ,వర్కింగ్ ప్రెసిడెంట్ మైల నర్సింహ్మ కురుమ,కాంగ్రెస్ యువ నాయకుడు జెన్నె రాజు కురుమ,బండ బీరప్ప కురుమ,జోగు మల్లయ్య కురుమ,బెల్లపూరి మధు కురుమ,మరాటి మత్య్సగిరి కురుమ,కురుమ సంఘం సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News