Wednesday, September 17, 2025

బిచ్చగాడి జేబులో అన్నీ నోట్ల కట్టలే..

- Advertisement -
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్: షరీఫ్‌ బౌన్క్‌ అనే 50 సంవత్సరాల వ్యక్తి  గోరఖ్‌ఫూర్‌లో వీధుల్లో అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి చెవులు సరిగా వినపడవు. రోజూలానే శనివారం వీధుల్లో తిరుగుతుండగా అతడిని  బైక్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతని కాలు విరిగింది. దీంతో స్థానికులు గాయపడ్డ అతనిని ఆసుపత్రికి తరిలించారు. ఈ క్రమంలో అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం కోసం  గుర్తింపు కార్డులు ఏమైనా ఉన్నాయేమోనని జేబుల్లో వెతికారు. తీరా చూస్తే నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అన్నీ లెక్కబెట్టి చూస్తే రూ.3 లక్షల 64 వేలు ఉన్నాయి.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ఫూర్‌లో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News